SAKSHITHA NEWS

ఓటమి భయంతోనే చంద్రబాబు పై అక్రమ కేసులు

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం మేము సైతం అని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ కార్యక్రమం లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వేగేశన నరేంద్ర వర్మ మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నామన శివన్నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

రానున్న ఎన్నికలలో వైసిపీ ఓడిపోతుంది అనే భయం తో చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు

రాష్ట్రము లోని వ్యవస్థలఅన్నిటిని నిర్వీర్యం చేస్తూ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు.

వేలకోట్ల ప్రజాధనాన్ని దోచేసి, పదేళ్లుగా కోర్టులను మభ్యపెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరస్థుడు జగన్ రెడ్డి అని అన్నారు.

45 ఏళ్ల తన జీవితాన్ని తెలుగువారి అభ్యున్నతికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దారపోసిన అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబు ని జైలు పాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

సాయంత్రం వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు.

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS