SAKSHITHA NEWS

ఉద్యోగులందరిని ఐక్యం చేయడమే తమ లక్ష్యం
— ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవడం సులభతరం
— తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు

…..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఆత్మీయ ఇఫ్తార్ విందు ఉద్యోగుల ఐకమత్యానికి నాంది పలికిందని, ఉద్యోగులందరిని ఐక్యం చేయడమే తమ లక్ష్యమని, ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవడం సులభతరమౌతుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రితో పాటు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా ముస్లిం ఉద్యోగ సోదరులకు ఆదివారం సాయంత్రం ఖమ్మం నగరంలోని టీజీవో భవనంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ… పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిమ్ సోదర, సోదరీమణులు నెల రోజుల పాటు ఉపవాసదీక్షలు చేస్తున్న సందర్భంలో వారితో పాటు సకల ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఏకతాటిపైకి వచ్చి సంఘటితంగా పనిచేసేందుకు గాను టీజీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరిని ఐక్యం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాలు ఖమ్మం జిల్లా కమిటీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అయన పిలుపునిచ్చారు. ఉద్యోగులందరం ఐక్యంగా ఉంటేనే మన హక్కులను సాధించుకోవడం సులభమౌతుందన్నారు.

టీజీవో రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైన తరువాత తొలిసారిగా ఖమ్మం జిల్లాకు విచ్చేసిన సందర్బంగా ఖమ్మం జిల్లా నాయకత్వం, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్సులు, మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్సులు, రాష్ట్ర కార్యవర్గం కోశాధికారి ఉపేందర్ రెడ్డి, మహిళా ప్రతినిధి దీపారెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ గౌడ్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో టీజీవో అసోసియేట్ అధ్యక్షులు రమేష్ , జిల్లా కోశాధికారి శేషు ప్రసాద్, మహిళా అధ్యక్షులు ఉషశ్రీ, కార్యదర్శి సుధారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు నయీమ్ పాష, ఫిరోజి గణేష్, జినక వెంకన్న, జెవి రామకృష్ణ, కృష్ణారావు, హరికిషన్, పుష్పరాజ్, సాదిక్ ఆలీ, ఏవిఎన్ రాజు, నరేష్, మంజుల, విజయలక్ష్మి, రామమూర్తి, బాలాజీ, తమ్మిశెట్టి శ్రీనివాస్, సాంబయ్య, అయూబ్ ఖాన్,
నాగమణి, రమణ, సతీష్ రెడ్డి, విక్రమ్, నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా టీజీవో అధ్యక్ష కార్యదర్సులు సంగం వెంకట పుల్లయ్య, విజయ్ కుమార్ లు, బానోతు దస్రు, కోశాధికారి కస్తాల వెంకటేశ్వర్లు, ఖాసీం, ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ నాయకులు కొణిదల శ్రీనివాసరావు, గుంటుపల్లి శ్రీనివాసరావు, పొట్టపింజర రామయ్య, గంగవరపు బాలకృష్ణ, తాళ్లూరి శ్రీకాంత్, హరికృష్ణ, జయపాల్, విజయ్ కుమార్, దుర్గా ప్రసాద్, ఆయుష్ ప్రకాష్, టీజీవో మాజీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఖాజామియా, ఖమ్మం జిల్లా మైనారిటీ ఉద్యోగుల సంఘం (ఆల్ మేవా) అధ్యక్షులు యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శి మదార్ సాహెబ్, పాషా, జమీర్, మొహినుద్దీన్, తాజుద్దీన్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు భూక్యా నాయక్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు హకీమ్, సలీం, పంతులు, కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ సంఘాలైన యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జి. నాగమల్లేశ్వరరావు, కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, రంజాన్, మహమ్మద్ అలీ, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రంగారావు, మాజీ అధ్యక్షులు మధు, ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగేశ్వర రావు, కార్యదర్శి విజయ్, ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, సిపిఎస్ జిల్లా కార్యదర్శి చంద్రకంటి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 08 at 7.12.44 PM

SAKSHITHA NEWS