పట్టుపడితే పని పూర్తయ్యేంతవరకు పట్టు వీడని విక్రమార్కుల్లాగా పని చేసేవాళ్లే విభిన్న ప్రతిభావంతులు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్, గాజులరామారం మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై విభిన్న ప్రతిభావంతులకు జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ పట్టుపడితే పని పూర్తయ్యేంతవరకు పట్టు వీడని విక్రమార్కుల్లాగా పని చేసేవాళ్లే విభిన్న ప్రతిభావంతులు అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో తమ సాంస్కృతిక నాట్యంతో అందరినీ అలరించిన సాంస్కృతిక కళా బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే పలువురు విభిన్న ప్రతిభావంతులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించడంతో పాటు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల స్వయం ఉపాధి కోసం 5 విభిన్న ప్రతిభావంతుల గ్రూపులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున రుణాలను అందిస్తూ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, జంట మున్సిపల్ సర్కిళ్ల కమిషనర్లు నరసింహ, మల్లారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.