If the officials who prevent illegal sand transport are the ones who contribute to illegal sand
అక్రమ ఇసుక రవాణాను అరికట్టే అధికారులే అక్రమ ఇసుకకు సహకరిస్తే
సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు అధికారి కనుసైగల్లో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా* అక్రమ ఇసుకను అరికట్టే అధికారి అక్రమ ఇసుకకు సహకరిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి అంటున్న ప్రజలు. వంగూరు మండలం ఉల్పర వాగు నుండి ప్రతినిత్యం 40. నుండి 50 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఉంటాయి.100 డయల్ చేసినఅధికారులుపట్టించుకోరని.100 డయల్ చేసిన వారికి బెదిరింపు కాల్ వస్తాయని.
కొందరు భయపడుతూ మీడియాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీడియా ద్వారా జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఈరోజు ఉల్పర వాగు దగ్గర ఎల్లికల్ గ్రామం మీదుగా 8:35am ఉన్నత అధికారులు వస్తున్నారని వంగూరు మండలానికి చెందిన ఒక అధికారి ఫోన్ చేసి అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులకు చెప్పడం జరిగిందని అక్రమ ఇసుక రవాణా చేసే ఒక అతని కాల్ రికార్డింగ్ మీడియాకు అందడంతో విషయం బయటకు వచ్చింది.
కొందరు అధికారులు ఉల్పార వాగు దగ్గరికి మనము చేసే అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికివస్తున్నారంట పక్క సమాచారం అందింది.కావున అక్రమ ఇసుక రవాణా చేసేవారు అప్రమత్తంగా ఉండండి అంటూ వాళ్ళ అక్రమ ఇసుక నడిపే ముఖ్య నాయకుడు అక్రమ ఇసుక రవాణా చేసే వారికి సమాచారం ఇవ్వడం జరిగింది* *అంటే అధికారులు వస్తున్నారని అక్రమ ఇసుక రవాణా చేసే వారికి సమాచారం వంగూరు మండలానికి చెందిన అధికారి ఇచ్చాడని ఈరోజు ఉల్పారా వాగు దగ్గరికి అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికి కల్వకుర్తి డి.ఎస్.పి. సీఐ. ఎస్సై వస్తున్నారని ఉదయం 8:35 గంటల నుండి మధ్యాహ్నం 1:00pm గంటల వరకు ఉల్పారా వాగు దగ్గర ఉంటారని తర్వాత అక్రమ ఇసుక రవాణా యధావిధిగా చేసుకోవాలని అక్రమ ఇసుక రవాణా చేసే వారి నాయకుడు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది.
ఉల్పర వాగులో అక్రమ ఇసుక రవాణా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విచ్చలవిడిగా నడుస్తుంది. నెల రోజులుగా. ఎన్నోసార్లు 100 డయల్ కాల్ చేయడం. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈరోజు కొందరు అధికారులు ఎల్లికల్ గ్రామం మీదుగా ఉల్పర వస్తున్నారని అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులు జాగ్రత్త పడమని చెప్పిన అధికారి ఎవరు? అక్రమ ఇసుక రవాణా చేసే వారికి పక్కా సమాచారం ఇచ్చే వ్యక్తి ఎవరు?
ఇలా అన్ని ప్రశ్నలే కానీ సమాధానాలు దొరకని అక్రమ ఇసుక రవాణా. ఇలా ముందుగా అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులకు సమాచారం అందిన తర్వాత ఉల్పర వాగు వద్దకు వస్తున్న అధికారులకు అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులు దొరుకుతారా? అక్రమ ఇసుక అరికట్టే అధికారులే ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులకు సమాచారం ఇస్తే జిల్లా ఎస్పీ అలాంటి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రజలు అంటున్నారు.
ఇప్పటికన్నా జిల్లా ఎస్పీ. కలెక్టర్ ఉల్పర వాగు నుండి అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న అధికారిపై చర్యలు తీసుకొని అక్రమ ఇసుకను అరికట్టే విధంగా చూడాలని కొందరు గ్రామస్తులు అంటున్నారు.