If Telugu Desam Party wants to win, Don constituency should be given to KE family
తెలుగుదేశం పార్టీ గెలవాలంటే డోన్ నియోజకవర్గ కే.ఈ కుటుంబానికే ఇవ్వాలి
సాక్షిత న్యూస్ కర్నూల్
రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే గెలుపు గుర్రం లాంటి కే.యి.ప్రభాకర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
తెలుగుదేశం పార్టీ డోన్ లో గెలవాలంటే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ కేఈ కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వగృహం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విలేకరుల సమావేశాన్ని
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ కొప్పల శ్రీను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణాచారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి.యి. కేసన్న గౌడ్ లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి డోన్ నియోజకవర్గం లోని ఏ తెలుగు దేశం నాయకులు వ్యతిరేకం కాదని ఏ తెలుగుదేశం పార్టీ నాయకునికైనా డోన్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ గెలవాలని ఉంటుందని
ప్రజల బలమున్న కే.యి.కుటుంబానికి టికెట్ ఇస్తే డోన్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని రెండు పర్యాయాలు ఓడినంత మాత్రాన కే.ఈ.కుటుంబానికి ఒరిగింది ఏమీలేదని రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు దక్కాలంటే కే.ఈ కుటుంబం డోన్ లోనే ఉండాలని అవసరమైతే పార్టీ నాయకత్వాన్ని,మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను,అచ్చం నాయుడు ను,తెలుగుదేశం పెద్దలను అందరిని ఒప్పించి అయినా కే.యి.
ప్రభాకర్ కు డోన్ నియోజకవర్గం టికెట్ వచ్చేలాగా 100 కు 100% ఒప్పించుకుని అయినా మా విన్నపం తో అయినా కే.యి.ప్రభాకర్ కు తప్పకుండా టికెట్ వస్తుందని,ఏదో చిన్న తప్పిదం వల్ల అధిష్టానం ఇన్చార్జి నియామకం జరిగిందని, డోన్ నియోజకవర్గం ఇన్చార్జి వెంట ఎంతమంది ప్రజల భలం ఉందో ప్రజలందరికీ తెలుసని,నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే విధానాన్ని అధిష్టానానికి తెలియజేసమని అధిష్టానం కూడా మా నిర్ణయాన్ని ఆలకించిందని తప్పకుండా కే.యి. ప్రభాకర్ కి నియోజకవర్గ టికెట్ ఇస్తుందని,
మంత్రి పదవి కూడా అందిస్తుందని మాకు చంద్రబాబు నాయుడు మీద పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉందని,2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో టి.డి.పి. ఓడినంత మాత్రాన కే.యి. కుటుంబాన్ని తక్కువ అంచనా వేయకుండా,గెలుపు ఓటములు సహజమని రాబోవు ఎన్నికల్లో కే.యి.కుటుంబానికి టికెట్ ఇస్తే తప్పకుండా టీడీపీ గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
అలాగే జనవరి ఒకటో తేదీన జై ప్రభాకర్ ఆధ్వర్యంలో దాదాపుగా 5000 మంది కార్యకర్తలతో నూతన సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నట్లు ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాయి పల్లె సర్పంచ్ లింగన్న,చిన్న పూజర్ల ఎల్లా గౌడ్,ధర్మవరం సంజీవ్, చనుగొండ్ల గ్రామానికి చెందిన బాలయోగి,చెన్నయ్య,వెంకటాపురం పెద్దయ్య,గోసానిపల్లె శ్రీరాములు, అలే బాద్ పరమేష్,మాధవరం స్వామి,ఇతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.