ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.
‘కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే ప్రభుత్వ నిబంధనల వెనకున్న లక్ష్యం.
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం వివక్ష కాదని రాజ్యాంగంలో ఉంది’ అని తీర్పులో పేర్కొంది