మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత .
సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి.
నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేనని తెదేపా కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు.
మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి కొత్తపల్లి జవహర్ , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) కూడా పాల్గొన్నారు.
తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ
వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు ఎక్కువ లబ్ది కలుగుతుందన్నారు.
మద్యం, ఇసుక ధరలు విపరీతంగా పెంచారన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన చెందారు. ఒక చేత్తో రూ.1వంద ఇచ్చి మరో చేత్తో రూ.1 వెయ్యి దోచేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు మోసపోవద్దని తెలిపారు.
ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా తాను ప్రజలతో కలిసే నడుస్తా, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
ప్రజలు చేయవలసిందిగా ఒక్కటే చంద్రబాబు నాయుడు కి మద్దతుగా నిలుస్తు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలన్నారు. మహాకూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీలతో గెలిపించాలని కోరారు. మహాకూటమి కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.