SAKSHITHA NEWS

నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్ర లేపి సంతకం చేయమన్నారు.

‘నాకు మాత్రం ఏం తెలుసు.. సెకితో ఒప్పందం వెనుక అంత జరిగిందని! అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ అర్ధరాత్రి ఒంటిగంటకు నిద్ర లేపి, దస్త్రంపై సంతకం చేయమన్నారు.

అంత పెద్ద ఒప్పందంపై నాతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే ఏదో మతలబు ఉందనిపించింది.

అందుకే సంతకం చేయనన్నాను. మర్నాడు మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించేశారు. వాళ్ల మాటలు విని అప్పట్లో సంతకం పెడితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో!’ అని జగన్‌ ప్రభుత్వంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.


SAKSHITHA NEWS