చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్వార్ధ రాజకీయం నాకు తెలియదు..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి *
సాక్షిత : స్విమ్స్ ఆటో స్టాండ్ యూనియన్ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
నేను కార్మిక పక్షపాతిని, ఆటో కార్మికులకు ఎల్లప్పుడూ అండగానే ఉన్నాను, ఇక మీదట కూడా ఉంటాను. తిరుపతిలో నిర్మించిన 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రధానంగా వాడేది మన ఆటో కార్మికులే. మీరే ఆలోచించండి గతంలో తిరుపతి రోడ్లు ఎలా ఉండేవి .. ఇప్పుడెలా ఉన్నాయి. నేను తిరుపతికి మంచి చేశాను అని మొదట నమ్మాల్సింది కూడా మీరే. అంతేకాదు మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగానే ఉన్నాను. భవిష్యత్‌లో కూడా మన బంధం ఇలానే ఉంటుందని మాటిస్తున్నాను.
నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్వార్ధపు రాజకీయ నాయకుడిని కాదు.గడిచిన రెండున్నరేళ్లుగా తిరుపతిని అభివృద్ధి చేసి, 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ లు, ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలు ఇలా ఎన్నో అభివుద్ది పనులు చేసి మీ ముందుకు వచ్చాను. నేను కొత్తతరం రాజకీయ నాయకుడిని.. చదువుకున్న వ్యక్తిని..ఈ తరాన్ని ముందుకు తీసుకెళాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక్కడే పుట్టిన వాడిగా.. తిరుపతి నగరాన్ని నిస్వార్థంగా అభివృద్ధి చేసి ధైర్యంగా మీ ముందకొచ్చి ఓట్లు అడుగుతున్నాను. నా పనితనం చూసి నాకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నాను.
రానున్న రోజుల్లో పారిశుద్ధ్యం విషయంలో తిరుపతిని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతానని మాట ఇస్తున్నాను. కొంతమంది అనాలోచిత స్వలాభ ప్రయోజనాల కోసం ఆలస్యం అయ్యిందే తప్ప.. కచ్చితంగా పారిశుద్ధ్యం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. స్వార్ధపు నాయకులు ఉన్నంతకాలం ఊరు బాగుపడదు..
మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో తిరుపతికి IT కంపెనీలు తీసుకొచ్చేలా ప్రణాళికలు రుపొందిస్తున్నాం. వారికీ అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని చర్చలు కూడా చేస్తున్నాము. ఇప్పటికే పలు మిడ్ సైజ్ ఐటి కంపెనీలతో చర్చలు జరపడం జరిగింది. త్వరలోనే ఆధ్యాత్మిక నగరం ఆదర్శ నగరంగా ఐటీ హబ్ గా, నేరరహిత నగరంగా మనం చూడబోతున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. రానున్న ఎన్నికల్లో మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను.