తిరుపతి నగర రూపురేఖలు మార్చాను.. ఉన్నత చదువులు చదివి రాజకీయాలలోకి వచ్చాను.. అభివృద్ధి చేసి చూపించాను.. మన ఊరు మారింది అంటేనే నాకు ఓటు వేయండి..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .
స్థానిక 18వ వార్డు మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఎమ్మార్ పల్లికి సంబంధించిన అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, UDS, అవసరమైన చోట నీటి బోర్లు పూర్తి చేశాం. 40ఏళ్లుగా నోచుకోని సీతమ్మ నగర్ రోడ్డు పూర్తి చేశాను. దీంతో మీరందరూ ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ప్రయాణం చేయగలుగుతున్నారు. డిప్యూటీ మేయర్ అయిన దగ్గరి నుంచి ఎమ్మార్ పల్లి మీద ప్రత్యేక దృష్టి సారించి అన్ని మౌలిక వసతులు కల్పించగలిగాం.
ఇదేకాకుండా మన తిరుపతి మెట్రో నగరాలతో పోటీపడేలా 18మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7ఫ్రీలెఫ్టు రోడ్లు, 5స్లిప్వే రోడ్లు, నగర సుందరీకరణ చేశాం. భవిష్యత్తులో మరో 14మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మిస్తామని తెలియజేస్తున్నాను.
అలాగే తిరుపతిని నేరరహిత నగరంగా ఉండేలా హత్యలు, దొంగతనాలు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా IOT, AI టెక్నాలజీ ఉపయోగించి 4000 సీసీ కెమెరాలు అమర్చేలా ప్రణాళికలు రుపొందిస్తున్నాం. అంతేకాకుండా తిరుపతికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేలా ప్రణాళికలు రుపొందిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని ఇప్పటికే పలు మిడ్ సైజ్ ఐటి కంపెనీలతో చర్చలు జరిపాం.
తిరుపతి నగరాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడమే నా లక్ష్యం.. అందుకు మీ అందరి సహాయసహకారాలు అందించాలని కోరుతున్నాను.. అభివృద్ధిలో మీరు చేతులు కలపాలని కోరుకుంటున్నాను.
ఉన్నత చదువులు చదివి రాజకీయాలలోకి వచ్చాను.. ఈ రెండున్నరేళ్లలో అభివృద్ధి చేసి చూపించాను.. మన ఊరు మారింది అంటేనే నాకు ఓటు వేయండి..