SAKSHITHA NEWS

I am lucky to have such a good program among my favorite children on my birthday

నా పుట్టినరోజున నాకెంతో ఇష్టమయిన పిల్లల మద్య ఇంత మంచి కార్యక్రమం చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను

  • సీఎం జగన్

పిల్లలు బాగా ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు

నా సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో కష్టాలను చూశాను

పిల్లలు బాగుండాలనే తపన తల్లిదండ్రులలో చూశాను

మనం అధికారం లోకి వచ్చాక ఈ మూడున్నరేళ్ళలో విద్యారంగం పై దృష్టి పెట్టాము

ప్రతి ప్రభుత్వ బడుల్లోనూ,ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న 8 వతరగతి పిల్లలకు డిజిటల్ ట్యాబ్ లు ఇస్తున్నాం

తరాలు మారుతున్నా కొన్ని వర్గాల తలరాతలు మారకూడదని ,పిల్లలకు ఇంగ్లిష్ మీడియం అందకూడదని,పిల్లలకు డిజిటల్ విద్య అందకూడదని ఆరాటపడుతున్న కొందరు పెత్తందారుల భావాలను బద్దలు కొడుతూ విద్యారంగం లో మనం మార్పులు తెచ్చాం

ఆర్దిక అభివృద్దిలో,తలసరి ఆదాయాల్లో ప్రపంచ దేశాలమద్య ఆంతర్యాలున్నట్టుగానే…దేశం లో రాష్ట్రాలమద్య కూడా ఆంతర్యాలున్నాయి

రాష్ట్రం లో ఉన్న ప్రాంతాలమద్య,వర్గాలమద్యకూడా ఇలాంటి ఆంతరాలున్నాయి

దనిక దేశాలయిన అమెరికాలోనో,బ్రిటన్ లోనో సగటున తలసరి ఆదాయం మనం గమనిస్తే ఏటా కనీసం రూ.30 నుండి 80 లక్షల వరకు ఉంటుంది

మన దేశం లో తలసరి ఆదాయం చూస్తే కేవలం ఏడాదికి 2 లక్షలు కూడా ఉండదు

స్వతంత్రం వచ్చాక 75 ఏళ్లలోకూడా ఇదీ మన పరిస్దితి

ఇలాంటి అంతరాలు మన రాష్ట్రం లోనూ,దేశం లోనూ ఉన్నాయి

వీటన్నింటినీ మనం ఒక్కసారిగా చెరిపెయ్యలేకపోవచ్చు…కానీ ఆర్ధిక సమానత్వం లేకపోవడానికి ఎన్ని కారణాలున్నాసరే మనం అందించే చదువుల్లో సమానత్వం తీసుకువస్తే ప్రతి వర్గం ప్రతి కుటుంభం అభివృద్ధి ఫలాలను అందుకోగలుగుతుంది

మంచి చదువులు వారి తలరాతలు మార్చగలవు

మన చుట్టూ ఉన్న కుటుంభాలలో గమనిస్తే …చదువుకోలేని అక్క…చదువుకున్న తమ్ముడు ఇలా వీరిమద్యనున్న తేడా వారి జీవితాల్లో ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయో మనకు కనిపిస్తాయి

ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం చదువులను గమనిస్తే ఈ తేడా ఎక్కువగా కనిపిస్తుంది

కొందరికి ఇంగ్లిష్ మీడియం చదువులు దొరకడం లేదు

అందుకే వారి భవిష్యత్తును తీర్చి దిద్దడానికి మనం చర్యలు చేపట్టాం

మన సమాజం లో పిల్లలు ఇప్పటికీ ఎందుకు ప్రపంచం తో పోటీ పాలేకపోతున్నారో అన్నది ఆలోచిస్తే.. …నాలో ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే

కనీసం ఈ వర్గాల పసిపిల్లల తలరాతలని మనం మార్చలేమా ? అన్నదే నామనసులో ఉన్న ప్రశ్న

మన సమాజం లో కొందరు 21 వ శతాబ్దం లో,మరికొందరు 19 వ శతాబ్దం లో బ్రతికే పరిస్దితుల్లో ఉన్నారు

వీరు ఇలానే బ్రతకాలా ? వీరి బ్రతుకులు మార్చలేమా ? అన్న ప్రశ్నలే నాలో ఎప్పుడూ కలుగుతాయి

కొందరు ఎప్పటికీ నాణ్యమయిన విద్యను,ఇంగ్లిష్ మీడియం చదువులు చదవడానికి వీలు లేదా ?

పెత్తందారులంతా వారి పిల్లలనూ,మనవలనూ ఇంగ్లిష్ మీడియం లో చదివిస్తారు

కానీ.. పేదల పిల్లలవద్దకు వస్తే వీరికి ఉన్నత విద్య అందకూడదని కోర్టుకుపోయి కేసులు వేసే దౌర్భాగ్య పరిస్దితులు మన రాష్ట్రం లో ఉన్నాయి

వీరి పరిస్దితులు మారవా ? అనే ప్రశ్నలు నాలో ప్రతి నిమిషం వస్తున్నాయి

సామాజిక అంతరాలను అలాగే కొనసాగించే విద్యావిదానాలను,అధికారం లో వాటా ఇవ్వని రాజకీయ విదానాలను ఇకమీదటకూడా మనం కొనసాగించాల్సిందేనా ? అన్న ప్రశ్నలు నాలో కలుగుతాయి

వర్గాలమద్య అంతరాలను మనం ఇకపైకూడా కొనసాగించాల్సిందేనా ? అన్న విషయాన్ని మనమంతా అలోచించాలి

పలకల మీదనే కొన్ని వర్గాల విద్యాభ్యాసం ముగుసిపోతూ….కొన్ని వర్గాలకు మాత్రమే డిజిటల్ తరగతుల విద్య,ట్యాబులు,ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉండే సమాజాన్ని మనం ఆమోదించవచ్చా అన్నది మనమంతా ఆలోచించాలి

ఈ పద్దతిని పూర్తిగా మార్చే లక్ష్యం తో నేను మీవాడిగా మీలో ఒకడిగా మీ మనిషిగా ప్రతి తల్లికీ అన్నగా మీ కోసం నేనున్నానని మీకు హామీ ఇస్తున్నాను

నాణ్యమయిన చదువులు అందుకోలేని తరాన్ని చూస్తే…వారి అంతరాలు మనకు కనిపిస్తాయి

ఈ రోజు ఇంటర్నెట్ ఉండడం…ఇంటర్నెట్ లేకపోవడం కూడా డిజిటల్ విద్య పరంగా అంతరాలు కనిపిస్తున్నాయి

ఈ అసమానతల్లో మార్పులు రావాలి

నా పుట్టిన రోజుగురించి నేను మాట్లాడడం లేదు…ఈ తరం లో పుట్టిన ప్రతి బిడ్డగురించీ,భావితరాల పిల్లలగురించి ఒక మంచి మేనమామగా,ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బాద్యత తీసుకుని మాట్లాడుతున్నాను

అందుకే ఈరోజున 686 కోట్ల వ్యయం తో 5,18,740 ట్యాబ్ లను ప్రభుత్వ బడులలోనూ,ఎయిడెడ్ బడులలోనూ చదువుతున్న పేద పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నాను

ప్రభుత్వ బడులలోనూ,ఎయిడెడ్ బడులలోనూ చదువుతూ 2024-25 విద్యా సంవత్సరం లో ఇంగ్లిష్ మీడియం లో CBSE సిలబస్ కు అనుగుణంగా 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే పిల్లల సంఖ్య 4,59,564 మంది

8 వ తరగతి విద్యార్దులతో పాటు…వారికి చదువులు నేర్పే 59,176 మంది టీచర్లకు కూడా ఈ ట్యాబ్ లను ఇస్తున్నాం

ఏపీలో 26 జిల్లాల్లో 9,703 ప్రభుత్వ ,ఎయిడెడ్ బడుల్లో చదివే పిల్లలందరికీ వీటిని మరో వారం రోజులపాటు అందించనున్నాం …

ఈ ఏడాదినుండి ఇకపై ప్రతి ఏడాదీ 8 వ తరగతికి వచ్చే ప్రతివారికీ ఈ ట్యాబ్ లను ఇలానే ఇస్తాం

ఈ ట్యాబులన్నీ కూడా మల్టీలింగ్యువల్ ట్యాబులు

అంటే చదువులు ఇంగ్లిష్ మీడియం లోనూ,తెలుగులోనూ అర్ధమయ్యేటట్టుగా ఉంటాయి

ఇంకా ఇతర బాషలు కూడా అందుబాటులో ఉంటాయి

వీటివలన పిల్లలకు చదువుల్లో ఎంతో మేలు జరుగుతుంది

బడిలో చెప్పిన పాఠాలు…ఇంటికి వెళ్ళాక కూడా చదువుకునే విదంగా ఇందులో కంటెంట్ ఉంటుంది

ఈ ట్యాబులు రేపటి పౌరుల నేటి అవసరం

పిల్లలంతా ప్రతి ఒక్క విషయాన్నికూడా పూర్తిగా సులబంగా అర్ధం చేసుకునే అవకాశం ఈ ట్యాబ్ లో ఉన్న బైజూస్ కంటేంట్ ద్వారా లభిస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను


SAKSHITHA NEWS