అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మహబూబాబాద్ ,భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు చెందిన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూడాలని దేశ రాజధాని నుండి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి…, ప్రజలకు అవసరమైతే తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని వర్షప్రభావిత పరిస్థితులపై అధికారులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు పోన్ లో మాట్లాడుతున్నాను..
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు వెంకటాపురం ప్రాంత ప్రజలతో పాటు.., ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, నర్సంపేట, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలలో వర్షప్రభావిత ప్రాంతాల ప్రజలు దైర్యంగా ఉండాలి.., రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వయంత్రాంగం అండగా ఉంటుంది..
అధికారుల సూచనలను ప్రజలు పాటించాలి.. మీ..రక్షణ ప్రభుత్వ బాధ్యత ఎలాంటి అసౌకర్యం కలిగిన తక్షణమే సమాచారం ఇవ్వండి..
భారస నాయకులు, ప్రజాప్రతినిధులు కష్టంలో ఉన్న మీ..ప్రాంత ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి..
పరిస్థితి అదుపులోకి వస్తుంది.. రాష్ట్రప్రభుత్వం అండగా ఉంది.. ప్రజలెవ్వరూ అదైర్యపడకండి..
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు అని నా విజ్ఞప్తి.
- మాలోత్_కవిత
మహబూబాబాద్పార్లమెంట్సభ్యులు