SAKSHITHA NEWS

సాక్షిత : ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది

  • మరో అవకాశం ఇస్తే మళ్లీ.. మీ ముందుకు..
  • రాజ్యసభ లో ఎంపీ వద్దిరాజు వీడ్కోలు ఉపన్యాసం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు. రాజ్యసభ లో పదవీకాలం పూర్తయ్యే సభ్యులకు సభ వీడ్కోలు పలికింది. రిటైరయ్యే సభ్యులందరికీ.. చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముగింపు ఉపన్యాసం ఇచ్చారు

. తమ పార్టీ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టిన రవిచంద్ర.. పదవీకాలంలో సహకరించిన అప్పటి, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్లు వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్ ఖడ్, పార్లమెంటరి పార్టీ నేత కే. కేశవరావు, పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి తదితరులకు రవిచంద్ర కృతజ్ఞతలు చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ఇరవై నెలల తన పదవీకాలంలో అటు పాత పార్లమెంట్, ఇటు కొత్త పార్లమెంట్ భవనాల్లో కూర్చునే అవకాశం దొరకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇదే సమయంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు రావడం.. అందులో ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న.. మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఇక్కడే ఇదే సభలో మా పార్టీ తరపున మాట్లాడే అవకాశం రావడం చారిత్రక సంఘటనగా భావిస్తున్న. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని.. సమ్మక్క- సారలమ్మ గిరిజన యూనివర్సిటీ నా హయాంలో మంజూరు కావడం మరిచిపోలేని నేపథ్యం..అదే చట్టంలో పేర్కొన్న విధంగా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లోని ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం హామీల అమలుపై దృష్టి సారించాలని.. బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు పర్చాలని.. ప్రధాని నరేంద్ర మోడీ ని కోరారు. కేంద్రం నుంచి నిధుల మంజూరులో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ.. చివరలో.. అధినేత కేసీఆర్ మళ్లీ తనను ఆశీర్వదిస్తే.. ఇదే సభలో తిరిగి అడుగిడుతానని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. వద్దిరాజు రవిచంద్ర తన ఉపన్యాసాన్ని ముగించారు.

WhatsApp Image 2024 02 08 at 6.00.14 PM

SAKSHITHA NEWS