Hyderabad Deputy Mayor Mote Srilata Shobhan Reddy distributed the CM Relief Fund check
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను పంపిణీ చేసిన గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ తార్నాక లోని క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి,బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి,స్వరూప కి అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ వారికి వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి తో కలిసి బాధిత స్వరూప కి సీఎంఆర్ఎఫ్ 58000 చెక్కునఅందజేశారు.