మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలి – డా. మమత రఘువీర్.
— పోక్సో, రేప్ కేసులలో బాధిత మహిళల పట్ల దర్యాప్తు విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పట్ల శిక్షణా కార్యక్రమం
— హాజరైన జిల్లా అధికారులు, పోలీస్ బరోసా సెంటర్ రాష్ట్ర అధికారులు.
నల్లగొండ సాక్షిత ప్రతినిధి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ మరియు బరోసా సెంటర్స్ వారి అధ్వర్యంలో నిర్వహించిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో పోక్సో,రేప్ కేసులలో బాధిత మహిళల పట్ల దర్యాప్తు విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పట్ల మహిళా రిసెప్షన్ అధికారులకు, రైటర్స్, దర్యాప్తు అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి బరోసా సెంటర్స్ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్,డా.మమత రఘువీర్ మరియు ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ ఎస్పీ అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బరోసా సెంటర్స్ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్,డా.మమత రఘువీర్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. వేదింపులు, హత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, పిల్లలకు,ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ తెలంగాణ పోలీసు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలని అన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు, కోర్టులతో సమన్వయం గా పని చేస్తున్నాము అన్నారు. మహిళ రక్షణ భద్రతలో బాగంగా రాష్ట్ర పోలీసు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పని చేస్తుందని, మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించడమే ముఖ్య ఉద్ద్యేశం అని తెలిపినారు. భౌతిక దాడులను, హత్యాచారం దాడులను అడ్డుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. వేదింపులకు సంభందించి దైర్యంగ పిర్యాదు చేయాలి.జిల్లాలో బరోసా సెంటర్ నందు టీమ్ బాగా పని చేస్తుంది. టీమ్ లో మెడికల్ ఆఫీసర్, వీడియో రికార్డింగ్, కౌన్సిలింగ్, సైకాలకిస్ట్, న్యాయసలహాదారు ద్వారా భద్రత కల్పించడం. బరోసా సెంటర్ కు జిల్లా స్థాయిలో అన్ని విభాగాల వారు అనుబంధంగా పని చేస్తున్నారు అన్నారు. బాధితులకు నేషనల్ మినరల్ ఫండ్ ద్వారా చదువు, వైద్యం ఇతర అవసరాలను సైతం తీర్చుతున్నామని అన్నారు.
స్థానిక హాస్పటల్ సహాయంతో ఇన్ పేషెంట్ విభాగం ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తాము. సఖి, ఎన్జీఓ లాంటి ఆర్గనైజేషన్స్ తో సమన్వయంతో పని చేస్తూ బాధితులకు సెల్టర్ సైతం ఇస్తున్నామని తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ ఎస్పీ అశోక్ మాట్లాడుతూ మహిళల రక్షణగా, పిల్లల పై లైంగిక దాడుల నివారణ, నిరాదరణకు, దాడులకు గురైన మహిళలకు, పిల్లకు అండగా ఉండడం లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ,బరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయని అన్నారు. లైంగిక దాడులు జరిగితే దైర్యంగా పిర్యాదు చేయాలని కోరినారు. హత్యాచారం, బాలలపై లైంగిక వేదింపులు, దాడులు లాంటి కేసులు నమోదౌతున్నాయి. ప్రతి కేసుకు, పిర్యాదుకు బరోసా ఆన్లైన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కేసు ముగిసే వరకు సపోర్ట్ పరసన్, లీగల్ అడ్వైసర్ అందుబాటులో ఉంటారు. బాధితులకు బరోసా అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ,డిఎస్పి నరసింహ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, షి టీమ్ ఇంఛార్జి రాజశేఖర్ గౌడ్, సీఐ లు ఎస్ఐ లు, మహిళా రిసెప్షన్ అధికారులు ,స్టేషన్ రైటర్స్ మరియు బరోసా సెంటర్ కోఆర్డినేటర్ నళిని సిబ్బంది పాల్గొన్నారు