పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎంత దోచుకో పోతున్నారు: గాదె
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించుట మరియు నిర్వాసితులకు వరకు కూడా నష్టపరిహారం చెల్లించకుండా ఉండుట పై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు చేస్తున్నటువంటి నిరసన దీక్షలో మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు పాల్గొన్నారు..
గాదె మాట్లాడుతూ:
ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇప్పటివరకు పరిపాలించిన రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును వాడుకుంటుంది రాష్ట్రానికి జనాలకి మంచి చేయాలనే ఆలోచన లేకపోవడం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం గా పేర్కొనడం జరిగింది.అలానే ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంవలన ఈ ప్రాజెక్టు ఉపయోగం లేని ప్రాజెక్టుగా మారుతుందని. కేవలం 90 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉండటం వలన గ్రావిటీ మీద కాలువలకు నీటి సరఫరా జరిగే అవకాశం తగ్గిపోతుంది ప్రస్తుత అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి పార్టీలు కేవలం ఈ ప్రాజెక్టుని రాజకీయ నాయకులకు అక్రమ సంపాదన దోచిపెట్టే ఒక ప్రాజెక్టులాగ వాడుకుంటున్నారు తప్ప రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించట్లేదని పేర్కొనడం జరిగినది.. కొన్ని దశాబ్దాల కల అయినటువంటి ఈ ప్రాజెక్టుని కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కోసం పూర్తి చేయకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని అలానే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి చేయుట కొరకు ఏ పార్టీ ముందుకొచ్చిన ఆ పార్టీతో కలిసి రాష్ట్రం కోసం ప్రజల కోసం జనసేన పార్టీ ముందు ఉంటదని పేర్కొనడం జరిగింది..
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు,శిఖా బాలు, మధు లాల్,ముమ్మలనేని సతీష్, నెల్లూరి రాజేష్,తన్నీరు గంగరాజు పాల్గొన్నారు..