How many people will you sacrifice for power?… Chandrababu
“అధికారం కోసం ఎంతమందిని బలి తీసుకుంటావు?… చంద్రబాబూ” ౼ మంత్రి కాకాణి
“బాబూ… నీ పబ్లిసిటీ పిచ్చి కోసం ప్రజల ప్రాణాలు తీస్తావా..”!
సాక్షిత : నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సమావేశం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై ఘటైన వ్యాఖ్యలు చేశారు..
కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో లో తొక్కిసలాట జరిగి, 8 మంది మృతి చెందిన ఘటనపై కాకాణి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
అధికారం కోసం చంద్రబాబు ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటావు?…
కేవలం జనాభాను అధికంగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఇరుకు సందులో అధిక జనాభాను తరలించడం వలనే 8 మంది మరణానికి ప్రధాన కారణం…
పేదవాడి ప్రాణానికి వెలకట్టి వదిలేస్తావా! చంద్రబాబు
మృతుల కుటుంబాల ఘోష చంద్రబాబుకు తగులుతుంది
కూలీ కోసం సభకు వచ్చి, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గతంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణానికి కారణం కూడా చంద్రబాబే.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ,వింత ప్రవర్తనే నేటి ప్రమాదానికి కారణం.
రోడ్ షో కోసం భారీ బస్సును ఏర్పాటు చేసి ఇరుకు సందులో ఫొటోలు తీయడం కోసం బస్సును వెనక్కు ముందుకు నడపడం వల్లనే మరణాలు సంభవించాయి….
చంద్రబాబు సభకు వచ్చి మరణించిన వారు కూలీ పనులు చేసుకునే సామాన్య ప్రజలు, వాళ్ళ కుటుంబాలకు చంద్రబాబు ఏమని సమాధానం చెప్తాడు….
8 మంది మరణానికి ప్రధాన కారణమైన చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి
నెల్లూరు జిల్లా ప్రజలు చంద్రబాబుకు మరొకసారి సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు!
నెల్లూరు జిల్లాలో పర్యటన చేసే ముందు నెల్లూరు ప్రజలకు చంద్రబాబు.. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
2014 సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు ప్రకటించిన VCIC (వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్), BCIC, ఆటో మొబైల్ హబ్, దుగ్గరాజుపట్నం పోర్టు, హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్, ఎయిర్ పోర్ట్, స్మార్ట్ సిటీ ప్రకటన, మెరైన్ ఇనిస్టిట్యూట్, ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేస్తామని 4లక్షలు కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పిన నువ్వు ఒక్క హామీ అయినా నెరవేర్చావా!
చంద్రబాబుకు ప్రజలను నిరంతరం మోసం చేయడమే పని, తోక పత్రికలను అడ్డం పెట్టుకునే అధికారంలోకి రావాలని బాబు కలలు కంటున్నాడు.
విభజన హామీలు వదిలి ప్యాకేజికి తలొగ్గిన ఘనుడు చంద్రబాబు.
వీటన్నింటికి సమాధానాలు చెప్పిన తర్వాతే, జిల్లాలో అడుగు పెడితే బాగుంటుంది!
అభివృద్ధి అంటే మీ పత్రికల్లో వార్తలు రాయించుకోవటం కాదు.
విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనం బుద్ధి చెబుతారు
రాబోయే ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవటం ఖాయం.
చంద్రబాబు, తన సభలకు కూలీ కోసం వస్తున్న పేద ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తే బాగుంటుంది.