Houses should be given to deserving poor people Public demand
అర్హులైన పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రజాసంఘాల డిమాండ్
ఈరోజు తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అర్హులైన పేదలతో మంథని మండల తాసిల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ మంథని పట్టణంలో అనేకమంది పేదలు ఇంటి స్థలాలు లేక స్థలముండి ఇల్లు లేక కిరాయికి ఉంటూ అద్దె డబ్బులు చెల్లించలేక అప్పుల బాధతో కుటుంబాలు చిన్నాభిన్నమైతున్నాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్క పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.
సీఎం కేసీఆర్ పేదోడి సొంతింటి కల సహకారం చేస్తామని పలకడమే తప్ప మంథని నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవారికి కూడా ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం విచారకరమైన అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల్లో ఏ ఒక్క ఎస్ సి ఎస్ టి గాని మైనారిటీ గాని మున్సిపల్ కార్మికుల గాని ఇనుప రేకులు పాతబడిన సామాన్లు ఏరుకునే అటువంటి పేదవాడికి గాని గుట్ట కెళ్ళి కట్టెలు కొట్టుకొని పొట్ట గడుపుకునే ఏ ఒక్క పేదవాడి కూడా డబుల్ బెడ్ రూమ్ కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా అర్హులైన పేదలకు ఇండ్లు మరియు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని లేనియెడల రానున్న ఎన్నికల్లో లబ్ధిదారులతో నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాయకులు ఎరుకల సాగర్, బందెల రాజకుమార్, ఏల్పుల సురేష్, బావు రవి, లబ్ధిదారులు 200 మంది పేదలు పాల్గొన్నారు.