SAKSHITHA NEWS

షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడి
మాచర్ల నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభారాణి నియోజకవర్గ పరిధిలోని కారంపూడిలో ఇంటింట ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ముందుగా కారంపూడి చేరుకున్న జూలకంటి. శోభరాణి పల్నాటి ఆరాధ్యదైవమైన అంకాళమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. సైకిల్ గుర్తు పై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి. బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి లావు. శ్రీకృష్ణదేవరాయలును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటర్లను ఆమె అభ్యర్థించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా నారా. చంద్రబాబు నాయుడు ని గెలిపించుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.

అంతేకాకుండా టీడీపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లతో పాటు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1500, యువతకు 3000 నిదుద్యోగ భృతి, స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15000, ప్రతి రైతుకు ఏటా 20000 ఆర్థిక సహాయం తదితర పథకాలను కచ్చితంగా అందజేస్తామని ప్రతి పేదవారికీ అండగా ఉంటామని ఆమె తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే మాచర్ల నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. ప్రతిఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి టీడీపీ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని ఈ సందర్బంగా ఆమె ఓటర్లను కోరారు. శోభారాణి కారంపూడిలోని ఆర్యవైశ్య బజారు, చెక్ పోస్టు సెంటర్ లోని ముస్లిం బజారు, వినుకొండ రోడ్డులోని లింగయత్ బజారు తదితర విధులలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నా. సైదారావు, టౌన్ టీడీపీ అధ్యక్షులు కటికల. బాలకృష్ణ, టీడీపీ మైనారిటీ నాయకులు తండా. మస్తాన్ జానీ, షేక్. మోదీన్ సా, తెలుగు మహిళ అధ్యక్షురాలు కాటంరెడ్డి. నాగలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎస్పిఆర్ కృష్ణ, ఇమ్మిడి. సాంబశివరావు, బీజేపీ నాయకులు శెట్టి. హనుమంతరావు, భవిరిశెట్టు. రామారావు, గోళ్ళా. సురేష్ యాదవ్, పలిశెట్టి. రాఘవ, బొమ్మిన. వీరబ్రహ్మం, టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు బాలునాయక్, జనసేన పార్టీ నాయకులు బుసా. రామాంజనేయులు, కేసానుపల్లి కృష్ణ తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 26 at 3.31.33 PM

SAKSHITHA NEWS