SAKSHITHA NEWS

హోరేబ్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ అనాధ పిల్లల ఆశ్రమ భవనాన్ని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగత్గిరిగుట్ట లో హోరేబ్ మినిస్ట్రీస్ వారు నిర్మించిన (హోరేబ్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్) అనాధ పిల్లల ఆశ్రమ భవనాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ జగత్గిరిగుట్ట హోరేబ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అనాధల పిల్లలకు ఆశ్రమంను ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. నిరుపేద ప్రజలకు ఈ ఆశ్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆశ్రమ నిర్మాణానికి కృషి చేసిన సభ్యులు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హోరేబ్ మినిస్ట్రీస్ సభ్యులు మధుకర్ బైల్ల, సోను మధుకర్, డివిజన్ అధ్యక్షులు గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రవీందర్ మరియు తదితరులు పాల్గొన్నారు .