సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ……
హనుమకొండ జిల్లా…..
హాసన్పర్తి మండల పరిధిలోని డివిజన్ల మరియు గ్రామాలలో అనారోగ్యానికి గురైన 34 మంది బాధితులకు మంజురైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు సుమారు 10 లక్షల 84వేల రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతు.. ఆరోగ్య పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య పథకం వర్తించని వ్యాధులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు..
ప్రజా సంక్షేమం కోసం.. ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు..
దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రములో ప్రజాకర్షక పథకాలను రూపకల్పన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు….
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..