SAKSHITHA NEWS

పెద్దకాపర్తి లో హాకీ శిక్షణా శిబిరాలు ప్రారంభం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జిల్లా యువజన క్రీడా శాఖ నిర్వహించిన హాకీ వేసవి శిక్షణ శిబిరం మంగళవారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరానికి డిస్టిక్ యూత్ స్పోర్ట్ ఆఫీసర్ మహమ్మద్ మహబూబ్ మరియు జిల్లా సెక్రెటరీ ఇమామ్ కరీంల సహకారంతో నిర్వహించడం జరిగింది. హాకీ ట్రైనర్ గా ఓర్సువిజయ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి , మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం, నూతి వెంకటేశం, విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్, మోర ధనంజయ్, పున్న విష్ణు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS