SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 08 at 6.58.49 PM

సాక్షిత : *గత 2 సంవత్సరాలుగా నాల కన్వర్షన్ సమస్యలతో సతమవుతున్న HMDA పరిధిలోని స్ధల యాజమానులు ,నిర్మాణదారులు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ,ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ , భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన NAREDCO వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

ఈ సందర్బంగా NAREDCO వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ HMDA పరిధిలోని 15 % ఏరియా ను తాకట్టు పెట్టుకొని నిర్మణాలకు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి నిర్మణాలు పూర్తి అయిన సంవత్సర కాలమైన నాల సమస్య తో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాక ఇబ్బందులు పడుతున్న రెసిడెంట్స్ మరియు నిర్మాణదారులు. అదేవిధంగా నాల సమస్య తో HMDA పరిధిలో స్థల యజమానులు నిర్మాణాలు చేసుకుందాం అనుకుంటే బిల్డింగ్ పర్మిషన్ నాల సమస్య తో ఆగిపోయి ఇబ్బందులు పడచున్నారు అని HMDA పరిధిలోని నిర్మాణాలు పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నాల సంబంధించిన చార్జీలు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని,పంచాయితీ లే ఔట్ లో ఉన్న చిన్న చిన్న సమస్యలను, గజాలలో మిగిలిన భూమిలో భూమిని నాల కన్వర్షన్ కు సంబంధించిన విషయాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సవివరంగా వివరించి అసోసియేషన్ తరుపున వినతిపత్రం సమర్పించడం జరిగినది. దీనికి సానుకూలంగా స్పందించిన నవీన్ మిట్టల్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు అన్ని విని ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ,అన్ని సమస్యలు తీరుస్తామని నవీన్ మిట్టల్ సానుకూలంగా స్పందించడం జరిగినది.
అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించినదుకు NA REDCO వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ కి, ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు, NARDCO వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ KV ప్రసాద్, ఎక్జిక్యూటివ్ ప్రతినిధులు రాం కుమార్, సుభాష్,శివ చౌదరి,పవన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS