కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జగద్గిరిగుట్ట కు చెందిన హెల్పింగ్ హార్ట్స్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ వితంతు మహిళలు, తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద పిల్లల చదువుల పట్ల హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ సభ్యుల కృషి అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఫౌండర్ తూటే విజయ్ కుమార్, సభ్యులు డాక్టర్ సత్యనారాయణ, సయ్యద్ సాజిద్, అరుణ్ కుమార్, వీరేందర్ సింగ్, సెల్వ రాజ్ తదితరులు పాల్గొన్నారు.