మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్, రాజీవ్ గృహకల్ప రోడ్డు కాళీమాత గుడి వద్ద మల్లీశ్వరి అనే మహిళ రోజు సాయంత్రం పూలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది.
తోపుడు బండికి నెలకు 900/- రూపాయల అద్దె చెల్లిస్తున్నానని తనకు ఒక తోపుడు బండి ఇప్పించవలసినదిగా స్థానిక నాయకులు ద్వారా ఎమ్మేల్యే ఆర్కే ని కోరింది, ఎమ్మెల్యే ఆర్కే స్పందించి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం వద్ద తోపుడు బండిని మంగళగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు.
అడిగిన వెంటనే తనకు బండి ఇచ్చినందుకు సదరు మహిళ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే కి ధన్యవాదాలు తెలియజేసింది.