SAKSHITHA NEWS

హలో ఫ్రండ్స్ జర భద్రం …+92 విదేశీ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందా..? లిఫ్ట్ చేశారో మీ పని గోవిందా..!..అసలు స్టొరీ ఏంటి అంటే?

శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో

టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) మొబైల్ వినియోగదారులకు వాట్సాప్‌లో + 92తో మొదలయ్యే విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ దుండగులు +92 నెంబర్‌తో స్టార్ట్ అయ్యే నెంబర్ల నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు గుర్తించింది.

ఈ తరహ నెంబర్స్ నుంచి ఫోన్స్ వస్తే ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని వినియోగదారులకు సూచించింది.

ఈ నేపథ్యంలో డీఓటీ వినియోగారులకు విదేశీ నెంబర్లపై చేసే హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం….

సైబర్ నేరగాళ్లు సైబర్-క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు వ్యక్తిగత సమాచారాన్ని బెదిరించేందుకు/దొంగిలించడానికి ఇలాంటి కాల్‌ల ద్వారా ప్రయత్నిస్తున్నారని డీఓటీ పేర్కొంది. ముఖ్యంగా ఫోన్స్ ద్వారా ఏ చట్టబద్ధ సంస్థ అయినా వ్యక్తిగత వివరాలను అడగదని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచింది.

ముఖ్యంగా +92 (పాకిస్తాన్ కోడ్)తో ప్రారంభమయ్యేవిగా గుర్తించింది. ఈ నెంబర్‌ల నుంచి స్కామర్‌లు పౌరులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రక్షణ ఇలా..

సంచార్ సాథి పోర్టల్‌లో రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్ సౌకర్యం ద్వారా ఇటువంటి మోసపూరిత కాల్‌లను నివేదించాలని డీఓటీ ప్రజలను కోరింది.

సైబర్ నేరాలు మరియు ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో ప్రోయాక్టివ్ రిపోర్టింగ్ డీఓటీకు సహాయపడుతుంది.
వ్యక్తులు ఇప్పటికే సైబర్ క్రైమ్‌లు లేదా ఆర్థిక మోసాలకు గురైన సందర్భాల్లో సైబర్-క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సంఘటనలను నివేదించమని లేదా సైబర్ క్రైమ్ అధికారిక పోర్టల్‌ను సందర్శించమని సలహా ఇష్తుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో సైబర్ నేరాలు, బెదిరింపులతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నంబర్‌లతో సహా 1,500 మంది కాలర్‌లను డీఓటీ సుమోటోగా బ్లాక్ చేసింది. పెరుగుతున్న ఆర్థిక మోసాల దృష్ట్యా ఈ చర్యలు టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించి తీసుకన్నారు.

WhatsApp Image 2024 04 04 at 12.18.41 PM

SAKSHITHA NEWS