SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగరంలో ఆహార పరిశుభ్రతపై దృష్టి సారీంచాలని మునిసిపల్ హెల్త్ సిబ్బందిని ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో జరగగా, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అధికారులు పాల్గొన్నారు. ఓక పిర్యాధుదారుడు మాట్లాడుతూ కపిలతీర్థం రోడ్డులోని ఎగ్ రోల్స్ షాపు నందు చికెన్ రోల్స్ తిన్నానని, తాను పుడ్ పాయిజన్ తో ఇబ్బంది పడ్డాననే పిర్యాధుపై కమిషనర్ హరిత స్పందిస్తూ కార్పొరేషన్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణకు ఆదేశాలు జారీ చేస్తూ ఆ షాపును పరిశీలించాలని, అక్కడ అపరిశుభ్రంగా వుంటె తగు జరిమానాలు విదించాలన్నారు.

గత కొన్ని వారాలుగా హోటల్స్ శుభ్రతపై వస్తున్న పిర్యాదులపై స్పందిస్తూ తిరుపతి నగరపరిధిలోని చిన్నా, పెద్ద హోటల్స్ ను ఇకపై తరుచుగా తనిఖిలు నిర్వహించాలన్నారు. ఆహార పధర్థాలను విక్రయించే స్థలాల్లో శుభ్రంగా లేకపోయినా, నాన్ వెజ్ ను రోజుల తరబడి నిల్వ వుంచినట్లు గుర్తించినా వెంటనే జరిమనాలు విధించాలని, అవసరమైతే అలాంటి షాపులను మూయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ రైతుబజార్ వద్ద వేసిన పెన్సింగ్ వలన ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అయ్యాయని, ఆ పెన్సింగ్ తొలగించాలని, లక్ష్మీపురం వద్ద శ్రీనివాససేతు క్రిందనున్న రహదారులు గుంతలతో వాహనదారులకు ఇబ్బందిగా తయారైందని, అక్కడ రోడ్డును సరి చేయించాలన్నారు. అదేవిధంగా 12,13,14 డివిజన్లలో కుక్కల బెడద ఎక్కువగా వుందని చెప్పగా, పరిశీలించి తగు చర్యలు చేపడుతామని కమిషనర్ హరిత చెప్పడం జరిగింది. సోమవారం వచ్చిన పిర్యాదుల్లో లలితా జ్యూవెలర్స్ ఎదురుగా రెండు నెలల నుండి బిల్డింగ్ వర్కు జరుగుతున్నదని, అక్కడ సిమెంట్ పడకుండ ఎలాంటి పరధాలు లేవని, కేక్ వాలా దగ్గర త్రవ్వేసిన గుంట వలన ఇబ్బందులుగా వున్నాయని, సప్తగిరినగర్ నందు నీటి సరఫరకు రోడ్డుపైన త్రవ్విన గుంటలను పూడ్చాలని, ఎం.సి.ఆర్ కాలనీ బాలికల హాస్టల్ దగ్గర డ్రైనేజి పొంగుతున్నదని, కేశవాయనగుంటలో తమ ఇంటి ముందున్న ఓపెన్ డ్రైన్ బ్లాక్ అయ్యి తమ వాటర్ సంప్ లోకి కలుస్తున్నదని, వెంకటరెడ్డి నగర్లో డ్రైనేజి ప్రాబ్లమ్, కొర్లగుంట మారుతీనగర్లో డ్రైనేజి సమస్య, పట్నూల్ వీధిలో డ్రైనేజిని ఆక్రమించి భవనం కట్టారని, వైకుంఠపురం వద్ద భవన నిర్మాణ అనుమతులు అతిక్రమించి భవనం‌ నిర్మిస్తున్నారని, తిమ్మినాయుడుపాళెం బ్యాంక్ ఎంప్లాయిస్ కాలనీ నందు అక్రమ కట్టడం నిర్మిస్తున్నారని, వైకుంఠపురం నాల్గవ లైనులో శిధిలావస్థలో వున్న వాటర్ ట్యాంక్ ను తొలగించాలని, ఆ ప్రాంతంలోనే పది అడుగుల యుడిఎస్ ను అను సంధానం చేయాలనే అర్జీలు, పిర్యాదులపై కమిషనర్ హరిత స్పందిస్తూ పరిశీలించి తగు చర్యలు చేపడుతామన్నారు.

జరిగిన డయల్ యువర్ కమిషనర్ కు 12 పిర్యాధులు, అదేవిధంగా స్పందన కార్యక్రమంలో 17 అర్జీలు, పిర్యాధులు అందగా వాటిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, సంజీవ్ కుమార్, దేవిక, గోమతి, మహేష్, నరేంధ్ర తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS