SAKSHITHA NEWS

Health benefits of cloves

లవంగాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

తరచుగా లవంగాలను తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు నివారణ అవుతాయి.

లవంగాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధిస్తాయి కాగా డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో కూడా లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.

చాలామంది లవంగాలను సుగంధద్రవ్యాలుగా, మసాలాదినుసులుగా మాత్రమే చూస్తారు. కానీ లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

భోజనం చేసిన తర్వాత రోజు మూడు పూటలా లవంగాలను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. భోజనం తిన్న తర్వాత లవంగాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసే పేగులు శుభ్రపడతాయి..

కడుపులో సూక్ష్మజీవుల నుండి, వివిధ రకాల హాని కలిగించే క్రిముల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి లవంగం శరీరాన్ని కాపాడుతుంది. అలాగే లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గించి నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు. దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు నోట్లో లవంగం వేసుకుంటే ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు…


SAKSHITHA NEWS