SAKSHITHA NEWS

HDFC Bank Social Services Besh

హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ సామాజిక సేవలు భేష్*
షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదానం
హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు


రంగారెడ్డి జిల్లా సాక్షిత


ఆర్థిక రంగాలతో పాటు ప్రజలకు సామాజిక సేవలు అందించడంలో భాగంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ షాద్ నగర్ శాఖ రక్తదానం కార్యక్రమం చేపట్టడం ఎంతో గొప్ప విషయమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ కొనియాడారు. నేషనల్ లెవెల్ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ రక్తదాన శిబిరాలలో భాగంగా స్థానిక బ్రాంచ్ లో జ్యోతి ప్రజ్వలనతో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి, యుగంధర్, మొహమ్మద్ ఏజాజ్ (అడ్డు), బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్లు మనోహర్, లింగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆర్థిక సేవలు మెరుగ్గా అందించడంతో పాటు సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రజల్లో పారిశ్యుధ్యం పై అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఈ సందర్భంగా చైర్మన్ సూచించారు. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎలాంటి హాని ఉండదని 45 కిలోలు బరువు ఉన్న వ్యక్తులు యదేచ్చగా రక్తదానం చేయవచ్చని పేర్కొన్నారు.

మహమ్మద్ ఎజాజ్ అడ్డు మాట్లాడుతూ ప్రజలకు ఆర్థికపరంగా సేవలు అందిస్తూ ఎన్నో రుణాలను మంజూరు చేస్తూ ఇప్పుడు సామాజిక సేవలో భాగంగా రక్తదానం కార్యక్రమాలను చేపట్టడం గొప్ప విషయం అని అభినందించారు. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఇతర బ్యాంకులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. యుగంధర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు బ్యాంక్ యాజమాన్యం చేపట్టడం హర్షనీయమన్నారు.

మధురాపురం ఎంపీటీసీ భార్గవ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం కార్యక్రమం దిగ్విజయ వంతంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని సూచించారు. బ్యాంక్ సిబ్బంది ఇలాంటి చైతన్య స్ఫూర్తి కార్యక్రమాలు చేపట్టడం గర్వించదగ్గ విషయమని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది రాము, లింగారెడ్డి, నరసింహ, విజయ్, రాజశేఖర్, వసుంధర తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS