SAKSHITHA NEWS

Hat Se Hat Yatra should be successful

హత్ సే హత్ యాత్ర ను విజయవంతం చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ
రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభించిన హత్ సే హత్ యాత్ర ను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కోరారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి ఈ నెల 6 వ తారీఖున మేడారం సమ్మక్క సారలమ్మ లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం పూర్తి చేసుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కామేపల్లి మండలానికి 09.02.2002 న రాత్రి చేరుకుందని తెలిపారు. నేడు 10.02.2023న ఉదయం 9 గంటలకు కామేపల్లి మండల శివారు గ్రామ పంచాయతీ బర్లగుడెం, లచ్చ తండా నుండి పాద యాత్ర ప్రారంభమై బర్ల గూడెం, పొన్నేకల్లు, బందిపాడు, బంజర, గోవింద్రాల, పాత లింగాల, మీదుగా సాగుతూ కొత్త లింగాల క్రాస్ రోడ్ లో సాయంత్రం బహిరంగ సభ జరగనుందని అన్నారు.

ఈ యాత్రకు ఖమ్మం జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన విభాగం నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని రేవంత్ రెడ్డి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ మాత్రమే

అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన తెలంగాణ 2023-24 బడ్జెట్ అంకెల గారడీ మాత్రమే అని ఆరోపించారు.


ప్రభుత్వం రైతులకు సాగుకు కరెంటు ఇవ్వడం లేదని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ బృందం అడిగితే కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. ఇందుకు నిరసనగా 13 న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యుత్ కార్యాలయాల ముందు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతులందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు.

కేవలం 10 గంటలు కూడా రైతులకు నాణ్యమైన కరెంటు అందుబాటులో ఉండడం లేదని కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో నేడు రైతాంగం మగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా నెల రోజులుగా విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అవుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని గత బడ్జెట్లో ప్రతిపాదించిన రైతు రుణమాఫీ మొత్తంలో 25 శాతం కూడా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీకి కేవలం రూ.6,385కోట్ల కేటాయింపులకే పరిమితం చేశారని గత నాలుగు బడ్జెట్లో అన్ని కలిపి రూ.20వేల కోట్ల పైనే కేటాయింపులు చేసి కేవలం 12 వందల కోట్ల లోపే రుణమాఫీ కోసం నిధులు మంజూరు చేశారని తెలిపారు. సకాలంలో రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది రైతులు బ్యాంక్ ఖాతాలు ఎన్ఫీఏలుగా మారిపోయాయని అన్నారు.

అలాంటి వారికి బ్యాంకుల్లో రుణాలు అందే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో సంప్రదాయ పంటలైన పసుపు, చెరకు పంటలకు బడ్జెట్లో ఒక్క పైసా ఇవ్వలేదని పసుపు, చెరకు రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం ఆలోచన చేయలేదని అన్నారు.

పంటల బీమా పథకాన్ని పూర్తిగా వదిలేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు,పీసీసీ సభ్యులు మహమ్మద్ జావిద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పాలేరు పీ సీ సీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, వైరా పీసీసీ సభ్యులు వడ్డే నారాయణ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా మైనార్టీ నాయకులు హుస్సేన్, ఏలూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS