Harivillu founder Gangadhar Rao says he is re-opening Harivillu resort
హరివిల్లు రిసార్ట్ ను తిరిగి ప్రారంభిస్తున్నామన్న హరివిల్లు వ్యవస్థాపకులు గంగాధర్ రావు.
అటవీ శాఖ అధికారులతో అనేక ఇబ్బందులు ఎదురవడంతో మూడు రోజుల క్రిందట హరివిల్లు రిసార్ట్‌ను మూసి వేస్తున్నామని ప్రకటించిన హరివిల్లు రిసార్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ రావు నేటి నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
రిసార్ట్‌లో జీవనోపాధి పొందుతున్న 150 మంది ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారని, స్థానికుల సూచన మేరకు హైకోర్టును ఆశ్రయించగా తమకు అనుగుణంగా ఉత్తర్వులు రావడంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
హరివిల్లు రిసార్ట్ లో అక్రమాలు జరుగుతున్నాయని, అటవీ శాఖ భూమి ఆక్రమించుకున్నారని DFO మాటలు అవాస్తవమని,ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకుండా చట్టానికి లోబడి రిసార్ట్ నిర్వహిస్తున్నామని, ఒకవేళ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని నిరూపిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్న దానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
తమకు ఉన్న భూ పరిధిలోనే హరివిల్లు రిసార్ట్‌ను కొనసాగిస్తున్నామని,DFO కు అనుమానంగా ఉంటే అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులుకలిసి సర్వే జరిపించవచ్చని అంతేకానీ ఒకరిని బాధపెట్టేలా అనవసరమైన మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు.