SAKSHITHA NEWS

శరనంటూ వచ్చే ప్రతి ఒక్కరినీ రక్షించే దైవం హరిహసుత అయ్యప్ప : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ లోని 24వ వార్డు కౌన్సిలర్ అర్కల అనంత స్వామి ముదిరాజ్ కుమారుడు అర్కల ఓంకార్ (కన్నె స్వామి) ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ శరణు శరణు అయ్యప్ప అంటూ తనను నమ్మి కొలిచే భక్తులను కాపాడుకునే దైవం ఆ హరిహరసుతుడు అయ్యప్ప అని అన్నారు.

ఈ కార్యక్రమంలో దుందిగల్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, స్థానిక నాయకులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS