SAKSHITHA NEWS

  • కలిసిమెలిసి ఉత్సవం జరుపుకోవాలి.
  • సంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం.
  • ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు : రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట.

హోళీ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆదర్శంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళవద్దు, సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరం అని ఎస్పి తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవం జరుపుకోవాలి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా పండుగ జరుపుకోవాలి అన్నారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దు అని కోరినారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దు అన్నారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పి విజ్ఞప్తి చేసినారు.

CC లతో నిఘా ఉన్నది, వాహనాల తనిఖీలు నిర్వహిస్తాం, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు అని ఎస్పి తెలిపారు.

WhatsApp Image 2024 03 25 at 6.52.36 AM

SAKSHITHA NEWS