సాక్షిత ప్రతినిధి.
టిడిపి పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బాదేపల్లి రాజు గౌడ్
గర్భిణీ స్త్రీలే టార్గెట్. ఒక్క డెలివరీ కేసును ప్రైవేట్ హాస్పిటల్ కి పంపిస్తే 10000
జీతాల కన్నా కమిషనర్లు మిన్న అనే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ తీరు
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుల వద్ద వ్యక్తిగత సిబ్బంది గా గుర్తింపుఆ 6 మంది ప్రధాన పాత్రధారులు సూత్రధారులు*
దర్శకత్వం వహిస్తున్న ఆ ఇద్దరు డాక్టర్లకీలకపాత్రచూసిచూడనట్టు వివరిస్తున్న వైద్య ఉన్నత అధికారులు*
కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కు సంబంధం లేని ప్రవేట్ వ్యక్తుల హల్చల్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో టిడిపి పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బాదేపల్లి రాజు గౌడ్ మాట్లాడుతూ కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ గురించి రోజు ఒక కథనాలు వస్తున్నాయని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లకు కల్వకుర్తి పట్టణంలోనే ప్రైవేట్ హాస్పిటల్ ఉండడంవల్ల అందులో పని చేసే వ్యక్తిగత సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్లో వారి పేర్లతో హల్చల్ చేస్తున్నారనీ. అలాగే ప్రభుత్వ ఆస్పిటల్ లో పనిచేసే నర్సుల ద్వారా ఈనెల అనగా 19.06.2023 సుమారు నాలుగు డెలివరీ కేసులను తమ సొంత ప్రైవేట్ హాస్పిటలకు పంపించడం జరిగిందని. కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా నా మాటే శాసనం నేను చెప్పినట్టు వినకపోతే మీ సంగతులు అంతే అంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి హల్చల్ అంతా ఇంతా ఉండదు. ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది కూడా తీర్వ ఇబ్బందులకు గురవుతున్నారను హాస్పిటల్ లో వారిపేరుతోసిబ్బందికూడానానాఇబ్బందులకుగురవుతున్నారు.చెప్పిన విధంగా వినకపోతే వారికి ఇబ్బందులు తప్పడం లేదనీ.వారు పెడుతున్న ఇబ్బందులను బయటకు చెప్పుకోవడానికి కూడా సిబ్బందికి స్వేచ్ఛ లేకుండా పోయిందనీ. వైద్యుల వ్యక్తిగత సిబ్బంది తీరుపై హాస్పిటల్ కి వచ్చే సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనీ. వ్యక్తిగత సిబ్బంది చెప్పిన విధంగా హాస్పిటల్ కి వచ్చే రోగులు వినకపోతే వారికి ప్రభుత్వాసుటల్లో శరణ్య వైద్యం అందని పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే వారి పెతనం ప్రభుత్వ హాస్పిటల్ ల పైన ఎంత మేరాఉందోఇట్టేఅర్థమవుతుంది.*
ప్రభుత్వ హాస్పిటల్లో కొందరు నర్సులు.ప్రైవేటు వ్యక్తులు. డెలివరీ కేసులు ప్రైవేట్ హాస్పిటల్ లకు పంపుతూ హల్చల్
జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో చాలావరకు వైద్యం వ్యక్తిగత సిబ్బంది అన్ని వారే వ్యవ హరిస్తున్నారు. వెళ్లి ఎవరికిఫిర్యాదు చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరని వారి ఇష్ట రాజ్యం ప్రభుత్వాసుట్లో ఇంత అంత ఉండదు. హాస్పిటల్లో వారి వైద్యులు హాస్పిటల్ కి ఎప్పుడు రావాలి ఎంత సమయంలో అక్కడ నుండి వెళ్లి వారి ప్రైవేట్ హాస్పిటల్లో ఓపి చూడాలి అన్న పూర్తి వివరాలను వారే చూస్తారు.
హాస్పిటల్ లో ఎవరైనా క్రిటికల్ కేసులు వచ్చినప్పుడు వారి ప్రైవేట్ హాస్పిటల్లో వారి వైద్యులకు సిద్ధం చేయడం అప్పటికి హాస్పిటల్లో ఉన్న వైద్యులను మాట్లాడి వారిని హైదరాబాద్ రిపేర్ చేయడం లాంటి అంశాలను వీరు ముందుగానే చూసుకుంటారు. హైదరాబాద్ రిపేర్ చేసే రోగుల కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి అన్ని వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఇదే కాకుండా హాస్పిటల్ కి వచ్చిన రోగులను ఎవరైనా సిబ్బంది వైద్యం అందిస్తుంటే వారిని ఇబ్బందులకు పెట్టే విధంగా చర్యలను తీసుకునేలా వైద్యులకు లేనిపోని అంశాలను నూరిపోస్తుంటారు.ఉదాహరణకు కల్వకుర్తి కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు ప్రముఖ డాక్టర్లకు వ్యక్తిగత సిబ్బంది గా ప్రస్తుత ప్రజా ప్రతినిధి ఉన్నారనిప్రజలుచర్చించుకుంటున్నారు. ఇతను పూర్తిగా కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో తన కనుసైగల్ లో నడిపిస్తాడని ఒక్క డెలివరీ కేసును పక్కతో పట్టిస్తే పది వేలు ఇతనికి ముడుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
నిర్ణయాలు తీసుకోవడంలో వారి పాత్ర కీలకంకల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న ప్రైవేటు వ్యక్తుల
ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది లో కూడా ఒక ఐదు మంది కీలక పాత్ర పోషిస్తూ ఇతనికి. ఇద్దరు డాక్టర్లకు సహకరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇన్ని తెలిసినా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్. ఉన్నత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆ ఇద్దరు డాక్టర్ల పలుకుబడి హాస్పిటల్ లో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. వీరి నిర్లక్ష్య కారణంగా ప్రభుత్వ ఆసుటల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఆస్పత్రికి సూపరిండెంట్ మాదిరి గా అతని వ్యవహార శైలి ఉందని ప్రధాన కూడలిలో జోరుగా చేసే సాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి వైద్య అధికారులు స్పందించి వైద్యులు వారి వ్యక్తిగత సిబ్బందిపై చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా జరగకుండా చూడాలని టిడిపి పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బాదేపల్లి రాజు గౌడ్ కోరారు