SAKSHITHA NEWS


Haath Se Haath Jodo program from January 26

జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు కాంగ్రెస్ శ్రేణులు ప్రజా సమస్యలపై సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశానుసారం పిసిసి, సిఎల్పీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనములో జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సిటి, బ్లాక్, మండల, పట్టణ అద్యక్షులతో, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘ అద్యక్షులతో , పి సి సి సభ్యులతో హాత్ సే హాత్ జోడో అభియాన్ సన్నాహాక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ హత్ సే హాత్ జోడో అభియాన్ సమావేశాలు, పాదయాత్రలు జనవరి 26 నుంచి 2 నెలలపాటు నిర్వహించాలని,రైతు డిక్లరేషన్ మాదిరిగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రతి గడపకూ తెలియజేయాలని, దీనికి గాను మండల అద్యక్షులు వారి వారి మండలాలలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమమును జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు, నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు మహ్మద్ జావేద్ , ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు, జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు వడ్డే నారాయణరావు, మాళోత్ రాందాస్ నాయక్,మధిర నియోజకవర్గ పి సి సి సభ్యులు శీలం ప్రతాపరెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ పి సి సభ్యులు బైరు మనోహర్ రెడ్డి,

జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య,మధిర బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కన్నెబోయిన గోపీయాదవ్, మండల కాంగ్రెస్ అద్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి,మట్టె గురవయ్య,అంబటి వెంకటేశ్వరరావు, కొమ్మినేని రమేష్ బాబు, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,

సూరంశెట్టి కిషోర్, శీలం వెంకటనర్సిరెడ్డి,స్వర్ణ నరేందర్, బొడ్డు కృష్ణయ్య, కాపా సుధాకర్, పెద్దబోయిన దుర్గాప్రసాద్, కైసరు చంద్రశేఖర్ రెడ్డి, శివవేణు, పట్టణమ కాంగ్రెస్ అద్యక్షులు ఎదునూరి సీతారాములు, కూర పాటి సల్మాన్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS