Grow high with sportsmanship.
క్రీడా స్ఫూర్తితో ఉన్నతంగా ఎదగాలి.
స్మార్ట్ కిడ్జ్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ లో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్.
క్రీడా సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ఉన్నతంగా ఎదగాలని సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ తెలిపారు.స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు.తోలుత విద్యార్థుల గౌరవ వందనాన్ని సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య లు స్వీకరించారు.క్రీడల ప్రారంభ సూచికంగా గాలిలోకి బెలూన్లు ను ఎగురవేశారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక దారుఢ్యం పెరుగుతుందన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ను ఎదగాలని కోరారు.స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులను అన్ని అంశాలలో తీర్చిదిద్దుడం అభినందనీయం అన్నారు.పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులను చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతికం, సైన్స్ ఎక్స్పో , ఒలింపియాడ్ లు , పర్వదిన ఉత్సవాలు తదితర అన్ని అంశాలలో ఎదిగేలా ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య, ప్రిన్సిపాల్ విజయకూమారి,పిఇటి క్రాంతి కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులకు వివిధ అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు.కబడ్డీ, కోకో, రన్నింగ్, మ్యూజికల్ చైర్, హర్డిల్స్, స్పూన్ లెమన్ గేమ్,టెన్ని కాయిడ్, షటిల్ తదితర వివిధ రకాల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.మంగళవారం సాయంత్రం వరకు ఈ పోటీలను నిర్వహించిన అనంతరం నగర మేయర్ పూనకొల్లు నీరజ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణచైతన్య తెలియజేశారు.