గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల.
కుత్బుల్లాపూర్ మండల్ పరిధిలోని అర్హులైన 764 గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం పరిధిలోని మహారాజ గార్డెన్స్ లో గృహలక్ష్మి పథకం కుత్బుల్లాపూర్ మండల్ పరిధిలోని 764 లబ్దిదారులకు ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముక్యతిదిగా పాల్గొని మంజూరైన పాత్రలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు గృహలక్ష్మి పథకం ఓ వరమని, పేదల సొంతింటి కల నేరవేర్చిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ పథకం శాశ్వత గృహాన్ని పొందేందుకు అధికారం ఇస్తుందని మీ అందరికీ తెలియజేయడం. మీ శాశ్వత ఇంటిని పొందడానికి అర్హులైన ప్రతి కుటుంబానికి విడుతలవారీగా రూ. 3 లక్షలను పొందవచ్చు, బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పెన్షన్లు, రైతుబందు, కల్యాణలక్ష్మి, దళితబంధు, బీసీబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీ లక్ష్మ రెడ్డి, జైరాం, డివిజన్ అధ్యక్షులు, పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, శంకరయ్య, పోలె శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, కస్తూరి బాలరాజు, రషీద్ బైగ్, సయిద్ రషీద్, మారయ్య, సిద్ధికి, జల్దా లక్ష్మీకాంత్, నరేందర్ రెడ్డి, ఇమ్రాన్ బైగ్, సింగారం మల్లేష్, చందు, ఇబ్రహీం, ఫిరోజ్, , దాసరి లక్ష్మణ్,, మహేష్, దిలీప్, సాయి, అజాం, మహిళా నాయకురాలు ఫరజాణా, షమీమ్, మహిళా నాయకురాలు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.