SAKSHITHA NEWS

గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌

ఖమ్మం బ్యూరో చీఫ్,

గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ‘‘గ్రీవెన్స్‌ డే’’ ను పురస్కరించుకుని ఐడిఓసి లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలిస్తూ, ఆయా శాఖాధికారులకు కలెక్టర్ ఫార్వార్డ్ చేశారు.


ఈ సందర్భంగా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం నుండి పిల్లి విజయ్ కుమార్, తనకు 1.10 ఎకరాల పొలం ఉన్నట్లు, ప్రక్కనున్న రైతు తన 5 గుంటల పొలాన్ని కలుపుకొని సాగు చేసుకుంటున్నట్లు, సర్వే చేయించి, తన పొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరగా, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. వైరా మండలం సోమవరం గ్రామం నుండి కె. రాహుల్ సాయి, తాను వికలాంగుడినని, వికలాంగ ధృవీకరణకు సదరం క్యాంపు ఏర్పాటుకు కోరగా, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. కొణిజేర్ల మండలం గోపతి నుండి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, తనకు ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే లో నష్టపోయిన పైపులకు నష్ట పరిహారం ఇప్పించగలందులకు కోరగా, పిడి, నేషనల్ హైవే కు పరిశీలించి, తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కూసుమంచి మండలం గట్టు సింగారం నుండి గుగులోతు బాలు, తనకు గన్యా తాండ సర్వే నెం. 102/1 లో 1.00 ఎకరం, 127/ఏ లో 1.1250 ఎకరం భూమి ఉన్నట్లు, అట్టి భూమిని ఖాతా నెం. 729 పాస్ బుక్ లో కలుపగలందులకు కోరగా, తహసీల్దార్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. బోనకల్ మండలం నారాయణపురం నుండి కె. కనకారావు, తనకు సర్వే నెం. 137/ఆ/2 లో 0.36, సర్వే నెం. 8/ఊ/1 లో 0.05 ఎకరం భూమి వారసత్వం క్రింద వచ్చిందని, పట్టేదారుగా నమోదుచేసి, పాస్ బుక్ ఇప్పించాలని కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామం నుండి ఎం. వీరస్వామి, సర్వే నెం. 218 లో 15 కుంటల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు, నాలా కన్వర్షన్ కొరకు దరఖాస్తు చేసినట్లు, అనుమతికై కోరగా, పరిశీలించి, తగుచర్య చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామం నుండి వంకాయల పుల్లమ్మ, సర్వే నెం. 14 లో 3.24 ఎకరాల భూమికి అసైన్డ్ పట్టా ఇప్పించుటకు కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామం నుండి పివివీఎస్. శివరామకృష్ణ, సర్వే నెం.లు 340/అ/అ/1, 339/అ, 334/2/28/2/1/2, 334/2/45/4/అ/2 లలో అనధికార లే అవుట్లు చేసినట్లు, గతంలో ఉన్న రహదారి ని మూసివేసి, అక్రమ ప్రహారి గోడ కట్టినట్లు తగుచర్యకై దరఖాస్తు లో కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

స్థానిక వికలాంగుల కాలని, రమనగుట్ట నుండి బి. రమణ, తాను పశుసంవర్ధక శాఖలో పనిచేసి, పదవీ విరమణ పొందినట్లు, తనకు పెన్షన్, పీఆర్సీ ఇంకనూ మంజూరు కాలేదని ఇప్పించగలందులకు కోరగా, జిల్లా కలెక్టర్ జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిని తగుచర్యకై ఆదేశించారు. కల్లూరు మండలం చిన్న కోరుకోండి నుండి వేల్పుల అమృతమ్మ, తనకు 1999 లో ఇళ్ల పట్టా ఇచ్చినట్లు, కానీ స్థలం చూపించలేదని, చర్యకై కోరగా, తహసీల్దార్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. విద్యాపురం, మధిర మండలం నుండి ఏ. బిందు, తాను ప్రమాదంలో 6 నెలల క్రితం ఎడమకాలు కోల్పోయినట్లు, సదరం క్యాంపులో స్లాట్ బుక్ కు అవకాశం కల్పించాలని కోరగా, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తమకు డీఏ విడుదల, పీఆర్సీ 2023 ఏర్పాటు, సిపిఎస్ బదులు పాత పెన్షన్ పునరుద్ధరణ తదితర డిమాండ్ లపై దరఖాస్తు సమర్పించగా, అదనపు కలెక్టర్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS