మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్
సూర్యాపేట సాక్షిత
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం మైదానం లో సిబ్బంది, అధికారులతో కలిసి జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్ మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మరియు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటడం జరిగిందన్నారు, బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. మొక్కలు వృక్షాలు గా ఎదిగి కాలుష్యాన్ని, వాతావరణ వేడిని, భూ తాపాన్ని అదుపు చేయడానికి దోహద పడుతాయి, అడువులు వృద్ది చెందుతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు నాగభూషణం, రవి, ఏఓ సురేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, శివ శంకర్, డీసి ఆర్ బి ఇన్స్పెక్టర్ నర్సింహ, సీఐ లు సోమ్ నారాయణ్ సింగ్, రాజశేఖర్, ఆర్ ఐ లు శ్రీనివాసరావు, శ్రీనివాస్, గోవిందరావు, నర్సింహారావు, ఎస్సై లు ,ఆర్ ఎస్సై లు, ఏరియా ఏఆర్, డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.