SAKSHITHA NEWS

Grand Republic Day celebrations at Veenavanka High School

image 78

వీణవంక హై స్కూల్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఆకట్టుకున్న ఎన్సిసి పరేడ్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో హెచ్ఎం పులి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రిపబ్లిక్ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్సిసి ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్సిసి పరేడ్ నిర్వహించి, కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా హాజరైన సర్పంచ్ నీల కుమారస్వామి,ఉప సర్పంచ్ ఓరెం భానుచందర్, ఎస్ఎంసి చైర్మన్ శ్యామలకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులుగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.

ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగం కల్పించని విధంగా ఆర్టికల్ 326 ద్వారా యావత్ భారత ప్రజానీకానికి ఏకకాలంలో ఓటు హక్కును కల్పించి ఘనుడు అంబేద్కర్ అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బడుగు,బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో మరియు రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించి, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని అందించిన మానవతావాది అంబేద్కర్ అన్నారు. అంటరానితనాన్ని ఆర్టికల్ 17 ద్వారా నిషేధించి సామాజిక సమానత్వాన్ని కల్పించారన్నారు. అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేసిన మహనీయులు అంబేద్కర్ అన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందన్నారు. క్రీడాకారులకు బహుమతులకై 5000 రూపాయలు అందించిన జిసిటివో ఓరెం విజయకుమార్ గారిని హెచ్ఎం పులి అశోక్ రెడ్డి అభినందించి, వారి తల్లి శ్రీమతిని శాలువాతో సన్మానించారు. అనంతరం అటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించి విద్యార్థులకు స్వీట్ పంపిణీ చేశారు.


SAKSHITHA NEWS