SAKSHITHA NEWS

మేయర్ డాక్టర్ శిరీషకు టిటిడి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మేయర్ దంపతులును ఆశీర్వదించారు.

మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు..

నగరంలో ప్రముఖులు, డాక్టర్స్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు..

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన వేడుకలు తన చాంబర్లో ఘనంగా నిర్వహించారు. నగరపాలక కమిషనర్ హరిత, వివిధ శాఖల ఉద్యోగులు మేయర్ ని కలసి పుష్ప గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ కేక్ కట్ చేశారు. తొలి మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన సందర్భంగా ప్రముఖులు, డాక్టర్స్, కార్పొరేటర్లు తదితరులు మేయర్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


దొడ్డ రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు సుమారు రెండు వేల మందికి అన్నదానం చేశారు.
వైష్ణవి హాస్పిటల్ వద్ద డాక్టర్స్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వివిధ ఆలయాల అర్చకులు మేయర్ డాక్టర్ శిరీష ను కలిసి ఆశీర్వదించారు.

మేయర్ ను కలిసిన వారిలో కమీషనర్ హరిత ఐఏఎస్, కార్పొరేటర్లు, అధికారులు, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS