పార్టీ టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా పోటీ చేసి గెలుస్తా
కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా
రహదారి పొడవున జననిరాజనం
భారీ జన సందోహం మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్న వీరేశం
నకిరేకల్ సాక్షిత ప్రతినిధి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం 46వ జన్మదిన వేడుకలను నకిరేకల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, జిల్లా నాయకులు అంతటి పారిజాత నరసింహ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం నకిరేకల్ కి బయలుదేరే క్రమంలో చిట్యాల పట్టణంలో మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో ఎద్దులపూరి కృష్ణ, ఏర్పుల పరమేష్, కొల్లోజు శ్రీనివాస్ లు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నకిరేకల్ పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించి సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభా ప్రాంగణంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజ పలు ముఖ్య నేతలతో కలిసి కేకు కట్ చేసి మాజీ ఎమ్మెల్యే వీరేశం కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వేల మంది సమక్షంలో జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దని ఎవరెన్ని కుట్రలు చేసినా కక్ష సాధింపు చర్యలకు దిగిన భయపడేది లేదని నాపై ఎన్ని కేసులు పెట్టి బెదిరించిన అధైర్య పడే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని భీమా వ్యక్తం చేశారు
వీరేశం వర్గం అంటే కొంతమందిలో గుబులు మొదలైందని ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని అన్నారు. కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బలమైన కార్యకర్తల అండతో వచ్చే ఎన్నికల్లో వీరేశంని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందని అన్నారు. అనంతరం రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎప్పటికైనా వీరేశం అన్న వెంటే ఉంటానని అన్నారు. కొందరు నన్ను మహిళ అని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చెక్కు పవర్ రద్దుచేసి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగేలా చేశారని టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. నేను సిద్దిపేట బిడ్డనని సమస్యల పరిష్కారం కోసం నేరుగా మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నానని అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు గురిచేసిన కలిసికట్టుగా వేముల వీరేశం గెలుపుకు కంకణ బద్దులమై కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాటి నర్సిరెడ్డి, నాయకులు నర్రా మోహన్ రెడ్డి వట్టిమర్తి సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి, కేతేపల్లి మాజీ ఎంపీపీ గుత్తా మంజుల మధు, హైకోర్టు న్యాయవాది చలకాని వెంకన్న, సుంకరి యాదగిరి, బట్టు ఐలేష్, వట్టిమర్తి ఉపసర్పంచ్ సాగర్ల నరేష్, బెల్లి సైదులు, నీలకంఠం నరేష్, కుక్కల మోహన్, గోలి గణేష్, కోసనం అశోక్, అమరోజు మధన్, అమరోజు నవీన్, ఆలె శ్రీహరి, రూపని రామచంద్రం, జిట్ట బిక్షం, మైనంపాటి భాస్కర్ రెడ్డి, రాజు, నూనె శ్రీకాంత్ సాగర్ల బిక్షం సైదులు జలపాల ప్రవీణ్, లింగస్వామీ వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.