ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాసనగర్‌లో గల రెజొనెన్స్ పాఠశాలలో యు.కె.జి. పిల్లలకు గ్రాడ్యూయేషన్డే నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.వి. నాగేంద్రకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు పిల్లల మనస్తత్వధోరణులు ఎలా ఉంటాయో వారు అడిగే ప్రశ్నలకు ఎలా స్పందిచాలో వివరించారు. రెజొనెన్స్ చిన్నారులు శ్నాతకోత్సవ గౌను తొడుక్కుని, తలపై టోపీలు పెట్టుకుని శ్నాతకోత్సవ మందిరంలో వారు హుషారుగా పట్టాలు అందుకున్నారు. వారంతా యు.కె.జి. నుండి 1వ తరగతికి వెళ్ళే చిన్నారులు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం వలన చిన్నారులకు స్కూలుపై, చదువుపై ఆసక్తి కలిగి ఉత్సాహంగా, ఆనందంగా స్కూలుకు వస్తారని మరియు వారు అన్ని అంశాలలో ఆల్‌రౌండ్ డెవలప్మెంట్ సాధించేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. తమ పాఠశాల ప్రారంభం నుండి ఇటువంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల, తల్లిదండ్రుల ఆదరాభిమానాలను పొందుతున్నామని ఆమె తెలిపారు. డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉపాధ్యాయులు అని, వారు తమ పిల్లల కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని, పిల్లలు అడిగే వివిధ ప్రశ్నలకు మనం ఎంతో ఓపికగా సమాధానం చెప్పాలని కోరారు. దానివలన చిన్నారులలో మానసిక ఉల్లాసం పెరిగి చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కేవలం తమ చిన్నారులు తరగతి గదులకే పరిమితం కాకుండా వారి మానసికోల్లాసాన్ని పెంపొందించేందుకు మేము ఇటువంటి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాన్వకేషన్ డ్రెస్‌లో పట్టాలు అందుకున్న తమ చిన్నారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. వారి అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కూడా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆ తరువాత నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.