మీ వెంటే మా పయనం” అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్బుల్లాపూర్ కాపు సంఘం నాయకులు…
సాక్షిత : చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాపు సంఘం నాయకులు విల్లా మూర్తి ఆధ్వర్యంలో 50 మంది ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కుల, మత, ప్రాంతాలకతీతంగా అభివృద్దే ఎజెండాగా పాలనను కొనసాగిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కెసిఆర్ గారన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలోని బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. అనంతరం కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తోనే సాధ్యమని విశ్వసిస్తూ మా పూర్తి మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వివేకానంద కేనన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : పుష్పాల అర్జునరావు, వెంకట్, తోట రాధా మోహన్, పల్లి శెట్టి శ్రీనివాసు, పి నాగరాజు, పి కనకరాజు, ఎస్ మాధవ్, సయ్యద్ అలీక్, వికాస్, సుజిత్ కుమార్, పులీసా, రౌతు గౌరీ శంకర్, రౌతు మణికంఠ, బి సుధీర్, జి పవన్, ఎం తిరుపతి, పి. ఫణి కుమార్, టీ. చిన్న, సీహెచ్. రాము లతో పాటు 50 మంది…