SAKSHITHA NEWS

బెంగుళూరు:-కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి.చిక్‌మగళూరు జిల్లా యంత్రాంగం పే ఫ్రీజ్ నోటీసును జారీ చేసింది. మీరు పూజలు చేస్తున్న ఆలయాల్లో ఆదాయం తగ్గింది. కానీ ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం తీసుకున్నారు. కనుక గత 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సిద్దరామయ్య సర్కార్ డిమాండ్ చేసింది.


ముఖ్యంగా కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరేమగలూరు కన్నన్ కు సిద్ధరామయ్య ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాదిలోనే కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ నోట్ పంపింది. నెలకు పూజారి హిరేమగలూరు కన్నన్ కు వేతనంగా రూ.4500 చెల్లిస్తూ ఉండేవారు ఇలా 10 ఏళ్లకు గాను 4,74,000లను చెల్లించారు. ఈ మొత్తాన్ని పండితులు, పూజారి హిరేమగళూరు కన్నన్‌ ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీసు జారీ చేసింది.


కన్నడ పండితుడిగా, కన్నడ పూజారిగా పేరుగాంచిన హిరేమగళూరు కన్నన్ గత 50 ఏళ్లుగా చిక్కమగళూరు శివార్లలోని కల్యాణ కోదండ రామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకూ నెలకు 7500 రూపాయలు. చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయ ఆదాయం తక్కువగా ఉండడంతో గ‌త ప‌దేళ్లుగా నెలకు రూ. 4500 జీతం చెల్లిస్తున్నారు. ఆ ఆలయం ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోవ‌డంతో గ‌త ప‌దేళ్లుగా చెల్లించిన జీతాన్ని తిరిగి ప్ర‌భుత్వానికి చెల్లించాల‌ని క‌న్న‌న్ కోరారు.

Whatsapp Image 2024 01 23 At 2.39.39 Pm

SAKSHITHA NEWS