కాంగ్రెస్ పాలనలో CM సొంత జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల అవస్థలు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటన బాధకారం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చూపే కపట ప్రేమకి నిదర్శనం.
ప్రభుత్వ నిర్లక్ష్యం వళ్లే వరుసగా ఇలాంటి ఘటనలు.
ఆసుపత్రి పాలైన విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాలి.
రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన, ఎంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం అప్రమత్తం అవ్వటం లేదు ఎందుకు?
విద్యార్థులంటే పట్టింపు లేదా ఈ ప్రభుత్వానికి?
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని విద్యార్థుల పట్ల దృష్టి సారించాలి.