హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్‌మెన్లను పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరెవరికి భద్రత అవసరమనే అంశంపై.. ఉన్నతాధికారులతో సమీక్షించి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు గన్‌మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది.
కాగా, ఆరు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను మరికాసేపట్లో డిశ్చార్జి చేయడానికి ఆస్పత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తుంటి మార్పిడి విజయవంతం కావడం, మరుసటి రోజునే ఆయన వాకర్ సాయంతో నడవడం, ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. డిశ్చార్జి తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నందినగర్‌లోని తన పాత ఇంటికి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం..