SAKSHITHA NEWS

43 రోజుల దీక్ష.34 మందిఆర్టీసీ కార్మికుల త్యాగాలపలమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం


సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది కానీ అట్టి బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ధర్నాకు దిగడం జరిగింది. కల్వకుర్తి ఆర్టిసి డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ కార్మికులు కల్వకుర్తి డిపో నుండి బస్సులు నడపకుండా ధర్నాకు దిగడం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ53 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం జరిగిందని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని అందులో సుమారు 34 మంది కార్మికులు కూడా చనిపోవడం జరిగింది అయినా ఆనాడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదనీ చాలా బాధపడ్డామని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎంతో ఆనందపడ్డామని అంతలోనే గవర్నర్ ఆమోదించడం లేదని తెలియడంతో ఆవేదనకు గురయ్యామని ప్రతి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారే కానీ ఆర్టీసీ విషయానికొస్తే చిన్నచూపు చూస్తున్నారని ఇప్పటికైనా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలపాలని కల్వకుర్తి ఆర్టిసి కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది.


SAKSHITHA NEWS