యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందచేయాలి….
-కృష్ణ సాయి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు
-రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి
సాక్షిత రాజమహేంద్రవరం :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందచేయాలని, ప్రజలు అందరికి యోగాపై ఆసక్తి కల్పించి వారి ఆర్యోగాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి కోరారు. యోగాకు ప్రధాని నరేంద్ర మోదీ అమితమైన ప్రచారం కల్పిస్తున్నారని, ఆయన కృషితో ఒలింపిక్స్‌లో యోగాను కూడా ఒక క్రీడగా ప్రవేశపెట్టడం తధ్యమన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో స్థానిక ఎ.పి. పేపర్‌మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు ప్రాంతాల నుంచి సుమారు 30 మంది పాల్గొనగా 20 మంది పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు.
ఈ సందర్భంగా జరిగిన బహుమతీ ప్రధానోత్సవ కార్యక్రమానికి డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నేషనల్ జడ్జి, కోచ్ గరిమెళ్ల రామకృష్ణ పరిశీలకుడిగా హాజరుకాగా జిల్లా ప్రధాన కార్యదర్శి, నేషనల్ జడ్జి కర్రి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.వి. సుబ్బారావు యోగాసన పోటీలను నిర్వహించారు. డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ యోగాలో ఒలింపిక్స్ వరకు వెళ్లి ఏ పతకం సాధించినా దేశానికి గర్వకారణమేనన్నారు. శ్రీధర్ రెడ్డి ఇటీవలనే యోగాలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యారని, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఆయన కృషిచేస్తున్నారన్నారు.
గరిమెళ్ల రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి వంటి వారు యోగా క్రీడకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. యోగాలో ప్రతిభ చూపిన వారికి 30 శాతం రిజర్వేషన్‌ను కూడా అమలు చేస్తున్నారని దీని వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంచి గవర్నమెంట్ ఉద్యోగావకాశాలు పొందేందుకు కూడా వీలుందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా యోగా క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించాలని ఆకాంక్షించారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు ముగ్గురు క్రీడాకారులు గిన్నీస్ బుక్‌లో పేరు నమోదు చేసుకున్నారని వారిని సభకు పరిచయం చేసారు. ఆయన పర్యవేక్షణలో పలువురు యోగ విద్యార్థులు యోగాసనాలు వేసి అందర్నీ అబ్బుర పరిచారు. అనంతరం విజేతలకు మెడళ్లు, సర్టిఫికెట్లు ప్రధానం చేసారు.
జిల్లా యోగాసనా పోటీలలో విజేతలుగా సబ్ జూనియర్స్ లో ట్రెడిషనల్ విభాగంలో కే. కార్తీక్ (బాలుర), వి.సాత్విక (బాలికలు), ఆర్టిస్టిక్ సోలో విభాగంలో కే. కార్తీక్ (బాలుర), వి. సాత్విక (బాలికలు), ఆర్టిస్టిక్ ఫెయిర్ విభాగంలో ఎన్. నవ్య, ఎం. భవిత, జూనియర్స్ ఆర్టిస్టిక్ సోలో విభాగంలో ఎస్.శరణ్య ట్రెడిషనల్ విభాగంలో బి.సౌజన్య, సీనియర్స్ ట్రెడిషనల్ విభాగంలో టి.సూర్య, మాస్టర్స్ ట్రెడిషనల్ విభాగంలో ఎస్.శ్యామ్ విచేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో గెలిచిన యోగ సన క్రీడాకారులకు సర్టిఫికెట్ల తోపాటు మెడల్స్ కూడా ప్రధానం చేశారు.
జడ్జిలుగా వ్యవహరించిన అనంతలక్ష్మి, జి.శ్రీనివాస్, బి.అరుణకుమార్, కె.హేమ నిర్మలారెడ్డి, శ్యామ్ సుందర్‌లకు కూడా సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, యోగా శిక్షకులు, యోగ విద్యార్థులు పాల్గొన్నారు.
[17:59, 27/08/2024] Manju Latha Reddy: ….