SAKSHITHA NEWS

అమరావతి..

విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు..

రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు..

2025 జూన్ లో ఒకటవ తరగతికి IBలో విద్యాబోధన చేపట్టనున్నారు.. ఇక, జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో విద్యాబోధన అందించేవిధంగా ప్లాన్‌ చేస్తున్నారు..

క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి ఐబీ సిలబస్ అందించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇలా 2037 నాటికి 12వ తరగతి వరకు ఐబీ సిలబస్ ప్రారంభించనున్నారు.. అంతేకాకుండా.. విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ అందించనున్నారు..

Whatsapp Image 2024 01 31 At 8.14.23 Am

SAKSHITHA NEWS